పాలకొండలో రేపు మూడు గంటల పాటు నిలిచిపోనున్న విద్యుత్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. ట్రాన్స్కో సబ్స్టేషన్ లో అత్యవసర నిర్వహణ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యుత్ వినియోగదారులు ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, సిబ్బందికి సహకరించాలని సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.