కరీంనగర్ అభివృద్ధి కోసం నూతన పారిశుద్ధ్య వాహనాలు ప్రారంభం
రిపోర్టర్: మహేష్
స్థలం: కరీంనగర్
కరీంనగర్ నగరంలో పారిశుద్ధ్య మెరుగుదల కోసం నూతనంగా కొనుగోలు చేసిన చెత్త సేకరణ రిక్షాలు, ఫాగింగ్ మిషన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. స్వచ్ఛ కరీంనగర్ మా లక్ష్యమని, త్వరలోనే ట్రాక్టర్లు, కొత్త జేసీబీలు, వైకుంఠ రథాలను కూడా అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు. నగర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు.