మట్టి గణపతినే పూజించాలి: మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపు
రిపోర్టర్: సునీల్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేటలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామంలో ఒక్కటే మట్టి విగ్రహం ఏర్పాటు చేస్తే పర్మినెంట్ షెడ్డు నిర్మిస్తానని హామీనిచ్చారు. రసాయన విగ్రహాలతో పర్యావరణం కలుషితమై క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని, ప్రతి ఒక్కరూ మట్టి గణపతినే పూజించాలని పిలుపునిచ్చారు.