మేడారంలో మొక్కులు చెల్లించుకున్న నాని మరియు శ్రీకాంత్ ఓదెల
రిపోర్టర్: సతీష్
స్థలం: ములుగు
ది ప్యారడైజ్ సినిమా ఘన విజయం సాధించడంతో హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. మేడారం వెళ్లేముందు గట్టమ్మను దర్శించుకున్న చిత్ర బృందం, అమ్మవార్లకు తమ బరువుకు తూగులా నిలువెత్తు బంగారాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు మేడారం వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్ర విజయం పట్ల వారు కృతజ్ఞతలు తెలుపుతూ అమ్మవార్ల ఆశీస్సులు పొందారు.