తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మార్చి నెలలో ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికల కోసం కసరత్తు వేగవంతం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక్కో స్థానం నుంచి ముగ్గురు చొప్పున ఆరుగురి పేర్లతో కూడిన జాబితాను పీసీసీకి అందజేశారు. ఈ నెల 29న ఢిల్లీలో జరిగే సమావేశంలో అభ్యర్థుల పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది.