ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు: భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయవాడ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలను ఈ నెల పదకొండో తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాలకు సుమారు ఇరవై ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. భక్తుల రద్దీ నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టి, ప్రత్యేక హోల్డింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.