నిరుద్యోగులకు భారీ ఊరట: నేడు పూర్తిస్థాయి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తిస్థాయి డీఎస్సీ నోటిఫికేషన్ను మంగళవారం విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. మొత్తం రెండు వేల ఏడు వందల ఇరవై ఒకటి పోస్టులకు ఈ ప్రకటన జారీ కానుండగా, ఈ నెల పదవ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టే అవకాశం ఉంది. పోస్టుల రిజర్వేషన్ రోస్టర్ కు సంబంధించి జిల్లా విద్యాధికారులతో సోమవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.