ఢిల్లీలో మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: వెంకట్
స్థలం: న్యూఢిల్లీ
ఢిల్లీలోని సదర్ బజార్ ప్రాంతంలో ఆరో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై దుండగుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్టేషనరీ కొనుగోలు చేయడానికి రాత్రి సమయంలో బయటకు వెళ్లిన బాలికను ఓ దుకాణంలోకి లాకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి ఈ అక్రమకార్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి 56 ఏళ్ల నిందితుడు మక్సూద్ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.