ఘోరం: ప్రభుత్వ ఉద్యోగం ఆశ చూపి యువతిపై అఘాయిత్యం
రిపోర్టర్: అశోక్
స్థలం: Medchal-Malkajgiri
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి నాలుగున్నర లక్షల రూపాయలు వసూలు చేసి, రిసార్ట్‌కు తీసుకెళ్లి యువతిపై లైంగిక దాడికి పాల్పడి, అనంతరం కదులుతున్న కారులో నుంచి రోడ్డుపైకి తోసేసిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. భువనగిరికి చెందిన జగన్మోహన్ అనే వ్యక్తి ఈ అరాచకానికి పాల్పడినట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సోమవారం అధికారులు వెల్లడించారు.