వైద్య పరీక్షల కోసం మణిపాల్ ఆసుపత్రికి ఆస్ట్రేలియా అధికారిక గుర్తింపు

రిపోర్టర్: గోపి స్థలం: తాడేపల్లి

ఆస్ట్రేలియా వెళ్లే వీసా దరఖాస్తుదారులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి అధికారిక గుర్తింపు లభించిందని ఆసుపత్రి డైరెక్టర్ జె. రామాంజనేయరెడ్డి శనివారం తెలిపారు. గతంలో హైదరాబాద్ వెళ్లాల్సిన దరఖాస్తుదారులకు ఇప్పుడు స్థానికంగానే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన లక్షలాది మంది తెలుగు ఎన్నారైలకు ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుందని రామాంజనేయరెడ్డి పేర్కొన్నారు.