గొల్లపల్లి జలాశయంలో విషాదం: విహారయాత్రకు వెళ్లి ఐదుగురు మహిళలు దుర్మరణం
రిపోర్టర్: మహేష్
స్థలం: శ్రీ సత్యసాయి జిల్లా
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పరిధిలోని గొల్లపల్లి జలాశయంలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. విహారయాత్ర కోసం డ్యామ్ వద్దకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వీరంతా గల్లంతయ్యారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.