ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై సీరియస్ స్పందించిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్

ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఘటనపై అత్యవసరంగా స్పందించాలని కోరుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నతాధికారులను కోరారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే పోలీసులే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గుండాలు రంగంలోకి దిగడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొంటూ తెలంగాణ డీజీపీతో పాటు సీఎం కార్యాలయాన్ని ట్యాగ్ చేసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా పరిగణించి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.