మానసిక ఆరోగ్య సంక్షేమం కోసం పీవీ సింధు అథ్లెటిక్స్ దుస్తుల విరాళం

రిపోర్టర్: రమేష్ స్థలం: Hyderabad

మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్కు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తన క్రీడా దుస్తులను విరాళంగా అందజేసినట్లు దీపికా పదుకొణె వెల్లడించారు. మానసిక సమస్యలపై అవగాహన కల్పించేందుకు, సహాయం అందించేందుకు ఈ విరాళాల సేకరణ దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. రూ. 850 నుంచి రూ. 1,100 ధరలలో ఈ వస్త్రాలు విక్రయానికి అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు సోమవారం పేర్కొన్నారు.