ఆరు సంవత్సరాల తర్వాత ప్రపంచ బిలియర్డ్స్ బరిలోకి గీత్ సేథి

రిపోర్టర్: గోపి స్థలం: కర్ణాటక

భారత క్యూస్పోర్ట్స్ దిగ్గజం, తొమ్మిది సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన గీత్ సేథి సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కరెంట్ బరిలోకి దిగుతున్నారు. ఆరు సంవత్సరాల విరామం తర్వాత ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆయన పోటీపడనున్నారు. ముంబై, అహ్మదాబాద్‌లలో జరిగిన టోర్నీల ద్వారా మళ్లీ ఆటపై ఆసక్తి పెంచుకున్న ఆయన, ఈ పునరాగమనం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు.