ఏపీ మద్యం కుంభకోణంలో త్వరలోనే పెద్ద చేపలు కటకటాలపాలు కావడం ఖాయం

రిపోర్టర్: సునీల్ స్థలం: Rajamahendravaram

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో రూ. వేల కోట్ల మేర భారీ మద్యం కుంభకోణం జరిగిందని, సిట్ దర్యాప్తులో స్పష్టమైన ఆధారాలు సేకరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రాజమండ్రిలో పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపులను పక్కనపెట్టి కేవలం నగదు రూపంలోనే వేల కోట్ల లావాదేవీలు సాగించారని, నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ దోపిడీ జరిగిందని ఆరోపించారు.