గిరిజనుల సొంతింటి కల నెరవేర్చడంలో ఎదురవుతున్న క్షేత్రస్థాయి సవాళ్లు

రిపోర్టర్: సురేష్ స్థలం: సీతంపేట

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పీఎం జన్మన్ పథకం కింద గిరిజనులకు నిర్మిస్తున్న పక్కా ఇళ్ల నిర్మాణాలు వివిధ కారణాల వల్ల మందగించాయి. నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడం, రవాణా ఇబ్బందులు తలెత్తడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం సరిపోక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో ఇంటికి అదనంగా ఇస్తామన్న సాయం త్వరగా అందిస్తేనే పనులు వేగవంతం అవుతాయని గిరిజనులు స్పష్టం చేస్తున్నారు.