తాగునీటి పథకాల పునరుద్ధరణ: కూటమి ప్రభుత్వ హయాంలో శరవేగంగా అభివృద్ధి పనులు
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
రాష్ట్రంలోని పట్టణ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు గత తెదేపా హయాంలో ప్రారంభించిన తాగునీటి పథకాలను వైకాపా ప్రభుత్వం పూర్తిగా మూలకు చేర్చిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని మళ్లీ పట్టాలెక్కించిందని అధికారులు తెలిపారు. గతంలో ఆగిపోయిన పనులతో పాటు తాజాగా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి, 2028 డిసెంబరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.