ప్రజల కష్టాలను మోదీ పట్టించుకోవడం లేదంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మండిపాటు
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
దేశంలోని కోట్లాది మంది ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి కేవలం అతికొద్ది మంది ధనవంతుల మేలు కోసమే ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పనిచేస్తున్నారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల పట్ల తమ పార్టీకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ, సామాన్య ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. దేశంలోని తొంబై తొమ్మిది శాతం అణగారిన వర్గాల ప్రజల కష్టాలను పాలకులు ఎప్పుడూ పట్టించుకోవడం లేదని అక్బరుద్దీన్ ఓవైసీ ధ్వజమెత్తారు.