సల్మాన్ ఖాన్ సినిమా విశేషాలు బయటపెట్టిన ప్రముఖ నిర్మాత కేసీ బొకాడియా

రిపోర్టర్: వెంకట్ స్థలం: Mumbai

సల్మాన్ ఖాన్ తన చిత్రం హమ్ తుమ్హారే హై సనమ్ లో నటించడానికి తండ్రి సలీమ్ ఖాన్ సిఫార్సే కారణమని ప్రముఖ నిర్మాత కేసీ బొకాడియా వెల్లడించారు. కథ కూడా వినకుండానే సల్మాన్ ఈ ప్రాజెక్ట్ కు అంగీకరించారని, తమిళ మూలాన్ని చూశాక షారుఖ్ ఖాన్ కూడా నటించేందుకు ఓకే చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా షూటింగ్ జ్ఞాపకాలను నిర్మాత గుర్తుచేసుకున్నారు.