మియాపూర్ భూముల వివాదంపై రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టిన హరీష్రావు

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని మాజీ మంత్రి హరీష్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మియాపూర్ భూముల విషయంలో బీఆర్ఎస్ నేతలపై సీఎం చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. కేసీఆర్ హయాంలోనే న్యాయపోరాటం చేసి ప్రభుత్వ భూములను కాపాడామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందే ఆ భూములను అమ్ముకోవాలనే ఆతృత రేవంత్లో కనిపిస్తోందని విమర్శించారు.