కక్ష సాధింపు చర్యలు విడనాడి ప్రజా సమస్యలు పరిష్కరించాలి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హుస్నాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం అక్కన్నపేట పరిధిలోని మోత్కుపల్లిలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల హామీల అమలులో విఫలమై ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని తీవ్రంగా ఆరోపించారు.