కుప్పంలో పౌల్ట్రీ రైతులతో సమావేశమైన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Kuppam

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కుప్పంలో పౌల్ట్రీ రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుపై రైతులతో చర్చించారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ఎన్విరాన్మెంటల్లీ కంట్రోల్డ్ పౌల్ట్రీ షెడ్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.