జనసేన ప్రత్యేక అడ్హాక్ కమిటీలపై కొణతాల రామకృష్ణ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: అశోక్
స్థలం: Anakapalle
జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం కోసం ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక అడ్హాక్ కమిటీలను ఏర్పాటు చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కొణతాల రామకృష్ణ అనకాపల్లి వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో సమాచార సేకరణకు, పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ కమిటీలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.