హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు: నగరంలో బీజేపీ పాదయాత్రతో వాహనదారులకు హెచ్చరిక
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నగరంలో నేడు భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. బీజేఆర్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు సాగే ఈ యాత్ర నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రత్యేక ఆంక్షలు, మళ్లింపులు అమల్ లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ మార్గాల్ లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని స్పష్టం చేశారు.