'ఆసియా క్రీడల కోసం ఎదురుచూస్తున్నా': అథ్లెట్ నందిని
రిపోర్టర్: నరేష్
స్థలం: తమిళనాడు
కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ అథ్లెటిక్స్‌లో అద్భుత పునరాగమనం చేసిన తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల 100 మీటర్ల హర్లర్ కే నందిని ఆసియా క్రీడలకు అర్హత సాధించారు. కోచ్ లేకపోవడం, వ్యక్తిగత ఇబ్బందులతో 2023లో కొద్దికాలం ఆటను వీడిన ఆమె, కోచ్ ప్రదీప్ పర్యవేక్షణలో మళ్లీ శిక్షణ ప్రారంభించి ప్రతిభ చాటారు. ఇంటర్-స్టేట్ మీట్లో 13.22 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న ఆమె, ఏషియన్ గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తానని ధీమా వ్యక్తం చేశారు.