గిరిజన ప్రాంతాల అభివృద్ధికి జాతీయ ఎస్టీ కమిషన్ ప్రత్యేక ఆదేశాలు

రిపోర్టర్: SK స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లాలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి మరియు హక్కుల పరిరక్షణపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో సిఫారసులకు తావులేకుండా అర్హులైన ఎస్టీ కుటుంబాలకు మాత్రమే ఇళ్లు అందాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి కనెక్షన్, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.