రాంబన్ జిల్లాలో కారులో విగతజీవులుగా పడి ఉన్న ఇద్దరు పోలీసులు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: జమ్మూ మరియు కశ్మీర్

జమ్మూ కశ్మీర్ లోని రాంబన్ జిల్లా బటోట్ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కారులో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. హెడ్ కానిస్టేబుల్ ఫరీద్ అహ్మద్, సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ ముహమ్మద్ యాకూబ్ లు జియారత్ మోర్ వద్ద కారులో అపస్మారక స్థితిలో కనిపించగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.