రైల్వే ప్రయాణికుల భద్రతే మా ధ్యేయం: డీఎస్పీ జి.మురళీధర్ స్పష్టీకరణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: నెల్లూరు
రైళ్లలో ప్రయాణికులు పోగొట్టుకున్న రూ.10 లక్షల విలువైన 50 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేసినట్లు నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.మురళీధర్ వెల్లడించారు. నెల్లూరులోని తన కార్యాలయంలో గురువారం ఆయన బాధితులకు ఈ ఫోన్లను పంపిణీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వీటిని రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. రైళ్లలో విలువైన వస్తువులు పోగొట్టుకుంటే బాధితులు వెంటనే సమీపంలోని రైల్వే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.