రాష్ట్రంలో 22ఏ జాబితా భూముల సమస్యకు శాశ్వత విముక్తినిచ్చిన ప్రభుత్వం

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

తెలంగాణ వ్యాప్తంగా చాలాకాలంగా 22ఏ జాబితాలో ఉన్న ఇండ్లు, ప్లాట్లకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం శాశ్వత విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. గురువారం రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని లక్షలాది మందికి భారీ ఊరట లభించింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులున్న ఆస్తులకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. తద్వారా నిలిచిపోయిన రియల్ ఎస్టేట్ లావాదేవీలకు మళ్లీ ఊపు రానుంది.