నెల్లూరు జిల్లాలో ప్రజలకు చేరువవుతూ వినూత్న పల్లె నిద్ర

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నెల్లూరు

పోలీసులు ప్రజలకు మరింత చేరువై సమస్యలను తెలుసుకోవడానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పల్లె నిద్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల తెలిపారు. మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఎస్సై మహమ్మద్ హనీఫ్ ఆధ్వర్యంలో పోలీసులు రాత్రి బస చేసి గ్రామస్థులతో సమావేశమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్ నేరాలు మరియు ఆన్ లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సూచించారు.