మనుబోలు మండల కేంద్రంలో ఘనంగా గణనాథుని ప్రత్యేక పూజలు

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ దిబ్బ మీద ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద ఎనిమిదవ రోజు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సాయికుమార్ శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజలకు ఉభయదాతలుగా పరిమళ సురేష్, సుగుణమ్మ దంపతులు వ్యవహరించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.