కొచ్చి విమానాశ్రయంలో కలకలం: ఐఫోన్ దిగుమతి సుంకంపై నిరసనకు దిగిన ప్రయాణికుడు

రిపోర్టర్: అశోక్ స్థలం: కొచ్చి

దుబాయ్ నుంచి కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న అజాస్ మహమ్మద్ తాను కొనుగోలు చేసిన ఐఫోన్ దిగుమతి సుంకం చెల్లించాలని అధికారులు కోరడంతో అక్కడే నిరసనకు దిగారు. వ్యక్తిగత వినియోగం కోసం తెచ్చిన ఫోన్కు సుంకం ఎలా కట్టాలని ఆయన ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. సుంకం చెల్లించేందుకు నిరాకరించడంతో అధికారులు ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై విమానాశ్రయంలో తీవ్ర కలకలం రేగింది.