తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరల పతనం, రోడ్లపై పంట పారబోసిన రైతులు

రిపోర్టర్: అశోక్ స్థలం: రంగారెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మార్కెట్‌లో 25 కేజీల బాక్స్ కేవలం రూ.30 నుండి రూ.55కే అమ్ముడవుతోంది. పెట్టుబడి కూడా రాక, రవాణా ఖర్చులు భరించలేక రైతులు తమ పంటను రోడ్లపై పారబోసి నిరసన తెలుపుతున్నారు. మధ్యవర్తులు లాభపడుతుంటే, అన్నదాతలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.