మా కుటుంబ ఆస్తులు తీసుకుని వెయ్యి కోట్లు ఇవ్వండింటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణ అనంతరం నాంపల్లి ఏసీబీ కోర్టు వెలుపల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు కొల్లగొట్టిందన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలపై స్పందిస్తూ, తమ కుటుంబ ఆస్తులన్నీ ప్రభుత్వమే తీసుకుని కేవలం వెయ్యి కోట్లు ఇస్తే ఎక్కడ సంతకం పెట్టమన్నా పెడతానని సవాల్ విసిరారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా బెదిరింపులకు లొంగబోమని ఆయన స్పష్టం చేశారు.