రూపాయలు పదకొండు వేల కోట్ల నిధులతో పల్లె పండుగ కార్యక్రమం

రిపోర్టర్: గోపి స్థలం: నెల్లూరు

ఉదయగిరి నుంచి పల్లెల్లో నవోదయానికి నాంది పలికామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పల్లె పండుగ మూడో విడత కోసం పదకొండు వేల ఎనుబది ఐదు కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా రామాపురంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కంటే తాము అధికంగా రోడ్లు నిర్మించామని వివరించారు.