గుజరాత్‌లో బాంబు బెదిరింపుల నిందితులు అరెస్ట్

రిపోర్టర్: సతీష్ స్థలం: Gujarat

గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం, అసెంబ్లీతో పాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను పేల్చివేస్తామంటూ ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్, ఝార్ఖండ్‌లలో సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రోషన్ కుమార్, గుల్షన్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి లక్షలాది ఈమెయిల్స్ జాబితాను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్‌వర్క్‌కు బంగ్లాదేశ్ నుంచి క్రిప్టోకరెన్సీ రూపంలో నిధులు అందినట్లు పోలీసులు గుర్తించారు.