పల్నాడులో డిజిటల్ అరెస్ట్ మోసాలపై పోలీసుల కీలక హెచ్చరికలు జారీ

రిపోర్టర్: హరి స్థలం: పల్నాడు

డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది. ఎవరైనా వీడియో కాల్ చేసి బెదిరిస్తే నమ్మవద్దని, పోలీసులు ఎప్పుడూ డిజిటల్ అరెస్ట్ చేయరని వెల్లడించింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఇతరులకు చెప్పరాదని హెచ్చరించింది. సైబర్ మోసాల బారిన పడితే వెంటనే 1930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పల్నాడు పోలీస్ శాఖ సూచించింది.