భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి హర్మన్ప్రీత్ కౌర్ గుడ్ బై

రిపోర్టర్: అశోక్ స్థలం: New Delhi

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సీనియర్ ఆటగారాలు హర్మన్ప్రీత్ కౌర్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నానని, ఇకపై కేవలం ఆటపై మాత్రమే దృష్టి సారిస్తానని ఆమె తెలిపారు. సుదీర్ఘకాలం పాటు తన నేతృత్వంలో జట్టును విజయపథంలో నడిపించిన హర్మన్ప్రీత్ నిర్ణయం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.