సంజీవని విధానాన్ని దేశవ్యాప్తంగా అమలును పరిశీలిస్తాం: కేంద్రమంత్రి జేపీ నడ్డా
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిన ‘సంజీవని’ అద్భుత కార్యక్రమమని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ప్రశంసించారు. ఇంటి వద్దకే వైద్య పరీక్షలు చేసి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించే ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. విజయవాడలో చంద్రబాబుతో కలిసి రూ.249.50 కోట్లతో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బ్లాకులు, ఐపీహెచ్ ల్యాబ్‌లను వారు ప్రారంభించారు. చంద్రబాబు అనుభవం ఏపీకి దృఢమైన పునాది అని నడ్డా కొనియాడారు.