నేటి తరం విద్యార్థుల మానసిక స్థితిపై చంద్రబాబు తీవ్ర ఆందోళన

రిపోర్టర్: గోపి స్థలం: ఆంధ్రప్రదేశ్

నేటి తరం విద్యార్థులు మానసికంగా చాలా సున్నితంగా మారుతున్నారని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ మీడియా, బాహ్య ప్రభావాలతో పిల్లలు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన హెచ్చరించారు. పోలవరం బాలిక ఆత్మహత్య, విజయనగరంలో తల్లి హత్య వంటి ఘటనలను ప్రస్తావిస్తూ, పిల్లల్లో మానసిక ధైర్యాన్ని నింపేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.