స్పోర్ట్స్ కోటా టీచర్ ఉద్యోగాలపై కూటమి సర్కార్ను నిలదీసిన వైఎస్సార్సీపీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

పక్షపాత రహితంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండానే స్పోర్ట్స్ కోటాలో 372 టీచర్ ఉద్యోగాలను ఎలా కట్టబెట్టారంటూ వైఎస్సార్సీపీ అధికారికంగా ప్రశ్నించింది. హడావుడిగా జారీ చేసిన జీవోల వెనుక అసలు మతలబు ఏమిటో ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని తీవ్రస్థాయిలో నిలదీసింది. అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.