రాష్ట్రంలో కొత్త బైపాస్‌ల నిర్మాణం: ఐదు ప్రాంతాలకు రూ.1,936 కోట్ల కేటాయింపు
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
రాష్ట్రంలోని పలు పట్టణాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులపై వాహన రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా నాలుగు హైవేలపై ఐదు చోట్ల కొత్త బైపాస్‌ల నిర్మాణానికి రూ.1,936 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. దీనివల్ల ఆయా పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని, ఇప్పటికే నిర్మించిన ఆరు బైపాస్‌లను యాక్సెస్ కంట్రోల్‌గా మారుస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.