కోయంబత్తూరులో నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ముగింపు
రిపోర్టర్: సురేష్
స్థలం: కోయంబత్తూరు
కోయంబత్తూరు వేదికగా జరిగిన నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ మొదటి రౌండ్ పోటీలు ఉత్కంఠభరితంగా ముగిసినట్లు నిర్వాహకులు తెలిపారు. రేసింగ్ పోటీలలో ధ్రువ్ గోస్వామి, బాలప్రసాద్లు అద్భుత ప్రదర్శనలతో విజయం సాధించారని పేర్కొన్నారు. చివరి క్షణాల వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో రికార్డు సృష్టించారని, కార్ రేసింగ్ ప్రియులను ఈ పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయని నిర్వాహకులు వెల్లడించారు.