'ఐఐఎం క్యాట్-2026 దరఖాస్తు గడువు పొడిగింపు': సెప్టెంబర్ 22 వరకు అవకాశం
రిపోర్టర్: శివ
స్థలం: భారతదేశం
దేశవ్యాప్తంగా నిర్వహించే ఐఐఎం క్యాట్-2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువును ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.in ద్వారా సెప్టెంబర్ 22, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఐఐఎం ప్రకటించింది. ఈ ప్రవేశ పరీక్ష నవంబర్ 29న జరగనుండగా, నవంబర్ 4 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.