రైతులకు ఊరట.. వరి పంటకు నీరందించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

పొదలకూరు మండలంలో వరి పంట చివరి దశలో నీటి ఎద్దడితో ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ఆందోళన చెందిన రైతులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల విజ్ఞప్తికి ఆయన వెంటనే స్పందించారు.

ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆదేశాల మేరకు తెలుగు గంగ ప్రాజెక్టు అధికారులు కండలేరు వాగుకు నీటిని విడుదల చేశారు. దీంతో పంటకు ప్రాణం పోసినట్లయిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చొరవను కొనియాడుతూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.