బీసీల హక్కుల కోసం పోరాడుతాం: శంషాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శంషాబాద్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గొల్లపల్లి ఎక్స్ రోడ్డు వద్ద టీపీసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా దక్కే వరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణన సర్వే చేపడతామని స్పష్టం చేశారు.