గోవిందా వ్యక్తిగత జీవితంలో కలకలం సృష్టిస్తున్న యువ నటి కోమల్ రాణి
రిపోర్టర్: శివ
స్థలం: ముంబై
బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా వ్యక్తిగత జీవితం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య సునీత అహుజాతో మనస్పర్థలు తలెత్తిన నేపథ్యంలో, యువ నటి కోమల్ రాణి ప్రవేశం కలకలం రేపింది. కూతురు వయసున్న నటితో గోవిందా సన్నిహితంగా ఉంటున్నారని, వినాయక చవితి వేడుకల్లో జంటగా కనిపించడం వివాదానికి దారితీసిందని సునీత ఆరోపించారు. ఈ పరిణామాలు బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారాయి.