అమెరికాలోని బోస్టన్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు: ఉప్పొంగిన తెలుగు సంస్కృతి
రిపోర్టర్: గోపి
స్థలం: Boston
అమెరికాలోని బోస్టన్ నగరంలో మాన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు పన్నెండొందల మందికి పైగా తెలుగు వారు కుటుంబ సమేతంగా పాల్గొని తెలంగాణ పల్లె వాతావరణాన్ని తలపించేలా వేడుకలు జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు సంఘాల ఐక్యతకు, మన సంస్కృతి పరిరక్షణకు ఈ వేడుకలు గొప్ప వేదికగా నిలిచాయని నిర్వాహకులు పేర్కొన్నారు.