ఆదివాసీలతో కలిసి దండారి నృత్యంలో కదంతొక్కిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

కుమ్మరికుంట గ్రామంలో జరిగిన దండారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. స్థానికులతో కలిసి సంప్రదాయ నృత్యం చేస్తూ ఉత్సాహంగా గడిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు మన పూర్వీకుల గొప్ప సంపద అని తెలిపారు. ఇలాంటి ఉత్సవాలు ఐక్యతకు ప్రతీకలని పేర్కొంటూ భావితరాలకు వాటిని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.