అనాసాగరం గ్రామ దీపిక అవినీతిపై అధికారులకు గ్రామస్తుల ఫిర్యాదు

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామ దీపికపై అవినీతి ఆరోపణలతో గ్రామస్తులు, డ్వాక్రా సభ్యులు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. డ్వాక్రా గ్రూపుల్లో అక్రమ వసూళ్లు, వీఏఓ పొదుపు, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని, గ్రామ దీపికను పోస్టు నుంచి వెంటనే తొలగించాలని అధికారులను కోరారు.